IQOO Neo 10R: 6.5 గంటల పాటు నాన్-స్టాప్ అల్ట్రా-స్మూత్ గేమింగ్.. అదికూడా కేవలం సింగిల్ ఛార్జ్‌కే..! 26 d ago

గేమింగ్ ప్రియులకు అదిరిపోయే శుభవార్త! ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న ‘IQOO Neo 10R’ స్మార్ట్‌ఫోన్ ఎట్టకేలకు భారత మార్కెట్లోకి అడుగు పెట్టింది. గేమింగ్ ప్రియులను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్.. అత్యాధునిక ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8s Gen 3 చిప్‌సెట్‌తో శక్తివంతమైన పనితీరును అందిస్తూ.. 6400mAh భారీ బ్యాటరీతో రోజంతా నిలిచే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ తో బీజీఎమ్ఐ గేమింగ్ అనుభవం చాలా బాగుంటుందని నిపుణులు తెలిపారు. అసలు ఈ ఫోన్ ఫీచర్లు ఏంటి? ఎందుకు గేమింగ్ కు అంత ప్రాముఖ్యత ఇస్తున్నారో..తెలుసుకుందాం రండి!
IQOO Neo 10R ఫీచర్లు:
డిస్‌ప్లే: 6.78-అంగుళాల AMOLED స్క్రీన్
పీక్ బ్రైట్‌నెస్: 4500 nits
రిఫ్రెష్ రేట్: 144Hz
ప్రాసెసర్: Qualcomm Snapdragon 8s Gen 3, అడ్రినో 735 GPU
బ్యాటరీ: 6400mAh
ఛార్జింగ్: 80W ఫాస్ట్ ఛార్జింగ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 15, Funtouch OS
బ్యాక్ కెమెరా: 50MP మెయిన్ కెమెరా (IMX882, OIS)
8MP అల్ట్రావైడ్ కెమెరా
ఫ్రంట్ కెమెరా: 32MP సెల్ఫీ కెమెరా
వేరియంట్స్:
- 8GB RAM + 128GB స్టోరేజ్
- 8GB RAM + 256GB స్టోరేజ్
- 12GB RAM + 256GB స్టోరేజ్
కనెక్టివిటీ ఫీచర్లు:
- బ్లూటూత్ 5.4
- Wi-Fi 6E
- USB టైప్-C
- 5G, 4G డ్యూయల్ సిమ్
సెన్సార్లు: ఫింగర్‌ప్రింట్ (ఆన్-స్క్రీన్), యాక్సిలెరోమీటర్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ, లైట్ సెన్సార్ మరియు ఇన్ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్ వంటి సెన్సార్లతో వస్తుంది.
కలర్ ఆప్షన్స్:
- మూన్‌నైట్ టైటానియం
- ర్యాగింగ్ బ్లూ
అదనపు ఫీచర్లు:
- 6K VC కూలింగ్ చాంబర్ (గేమింగ్ కోసం)
- 2000Hz ఇన్‌స్టంట్ టచ్ శాంప్లింగ్ రేట్
- 3 సంవత్సరాల OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్
- లైవ్ కటౌట్, సర్కిల్ టు సెర్చ్, AI ఫోటో ఎన్‌హాన్స్, AI ఎరేస్, AI నోట్ అసిస్ట్ వంటి AI ఫీచర్లు.
ఫోన్ ధర:
- 8GB RAM, 128GB స్టోరేజ్ -- రూ. 26,999
- 8GB RAM, 256GB స్టోరేజ్ -- రూ. 28,999
- 12GB RAM, 256GB స్టోరేజ్ -- రూ. 30,999
మైనస్ పాయింట్లు:
- ప్లాస్టిక్ బ్యాక్
- కొంచెం బరువుగా ఉండటం (196 గ్రాములు)
- NFC లేదు
IQOO Neo 10R అద్భుతమైన గేమింగ్ అనుభవాన్ని కోరుకునే వాళ్ళకి చాలా మంచి ఎంపిక. శక్తివంతమైన ప్రాసెసర్, అద్భుతమైన డిస్‌ప్లే, భారీ బ్యాటరీ మరియు మంచి కెమెరా సెటప్‌తో ఈ ఫోన్ ఇప్పటికే మార్కెట్లో మంచి పేరు పొందింది. కొన్ని చిన్న లోపాలు ఉన్నప్పటికీ.. ఆ ధర పరిధిలో ఇది బలమైన పోటీ ఇస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్ చిప్‌సెట్ తో దీని పెర్ఫార్మన్స్ చాలా ఆకట్టుకుంటుంది. 6.5 గంటల పాటు 90 FPS వద్ద బాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (BGMI)కు సపోర్ట్ చేస్తుందని..అల్ట్రా-స్మూత్ గేమింగ్‌ను ఒకే ఛార్జ్‌లో అనుభవించవచ్చని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ ప్రస్తుతం కేవలం అమెజాన్ స్టోర్ లోనే అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్.. ఆఫ్‌లైన్ అందుబాటులోకి రావడానికి కాస్త సమయం పడుతుంది.
ఇది చదవండి: వన్‌ప్లస్ కి ధీటుగా నథింగ్ ఫోన్ 3A.. మరిన్ని ఫీచర్లు కేవలం రూ.25 వేలకే.!